ఎన్నికల ఎఫెక్ట్.. ఒక రోజు స్టాక్‌మార్కెట్లకు సెలవు!

by Harish |   ( Updated:2024-03-16 14:11:35.0  )
ఎన్నికల ఎఫెక్ట్.. ఒక రోజు స్టాక్‌మార్కెట్లకు సెలవు!
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా దేశవ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయగా, దీని వలన స్టాక్‌మార్కెట్లకు ఒకరోజు సెలవు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మే 20, 2024న ఓటింగ్ ఉంటుందని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ రోజున స్టాక్‌మార్కెట్లకు సెలవు ఇచ్చే చాన్స్ ఉంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, గతంలో 2014, 2019లలో పోలింగ్ నిర్వహించినప్పుడు ఆ రోజున అన్ని కార్యలయాలకు సెలవు ప్రకటించారు. అలాగే, భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు కూడా BSE, NSE ట్రేడింగ్‌కు సెలవును ప్రకటించాయి. అలాగే, ఓటింగ్ రోజున ఫారెక్స్, మనీ మార్కెట్లు కూడా మూసివేయబడ్డాయి. కాబట్టి ఈసారి కూడా 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల కారణంగా మే 20(సోమవారం) సెలవు ఉంటుందని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed