ఈ వారం మొత్తం మార్కెట్లను వెంటాడిన యుద్ధ భయాలు

by Harish |   ( Updated:2023-10-21 06:13:12.0  )
ఈ వారం మొత్తం మార్కెట్లను వెంటాడిన యుద్ధ భయాలు
X

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్ ఈ వారంలో తీవ్ర ఒత్తిడితో నష్టాలను నమోదు చేసింది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య ముదురుతున్న యుద్ధం, ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా బాండ్ల ఈల్డ్స్ పెరగడం వంటి కారణాలతో ఈ వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1.33 శాతం క్షీణించి 65,397.62 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 1.05 శాతం పడిపోయి 19542.65 వద్ద ముగిసింది.

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) ఈ వారంలో రూ. 2,799.08 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు(డీఐఐలు) రూ. 3,510.97 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. అయితే, ఇప్పటి వరకు అక్టోబర్ నెలలో ఎఫ్‌ఐఐ రూ. 13,411.72 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించగా, డీఐఐలు రూ. 11,883.80 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

వారం మొత్తం కూడా బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. అదే, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 1.17 శాతం క్షీణించాయి. టెలికాం, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి 2 శాతం క్షీణించగా, పవర్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ 1 శాతం చొప్పున నష్టపోయాయి. మరోవైపు బీఎస్ఈ ఆటో ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది.

Advertisement

Next Story