సాఫ్ట్‌డ్రింక్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి!

by Vinod kumar |   ( Updated:2023-03-12 16:47:23.0  )
సాఫ్ట్‌డ్రింక్ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి!
X

న్యూఢిల్లీ: భారత సాఫ్ట్‌డ్రింక్ మార్కెట్ గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని ప్రముఖ పెప్సికో అతిపెద్ద ఫ్రాంచైజ్ కంపెనీ వరుణ్ బేవరేజెస్(వీబీఎల్) ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగంతో పాటు అమ్మకాలు కూడా పెరుగుతుండటమే దీనికి కారణమని వెల్లడించింది. ప్రధానంగా వేగవంతమైన పట్టణీకరణ, గ్రామీణ వినియోగం విక్రయాలకు దోహదపడుతున్నాయి. అధిక గిరాకీకి తగినట్టుగా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నామని, డిస్ట్రిబ్యూషన్ విధానం, ఇతర మౌలిక సదుపాయాల ద్వారా వినియోగదారులకు మరింత చేరువ కావాలని భావిస్తున్నట్టు కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది.

కొత్త ప్రాంతాలకు విస్తరించేందుకు తగిన వ్యూహాన్ని కలిగి ఉన్నామని, కస్టమర్ ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని డైరీ ఉత్పత్తులపై దృష్టి సారించనున్నామని కంపెనీ వివరించింది. ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన 'స్టింగ్' అమ్మకాలు భారీగా పెరిగాయి. దాన్నిబట్టి రానున్న రోజుల్లో కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు కపెనీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి : టైర్1, టైర్2 నగరాలపై దృష్టి సారించిన లాంబొర్ఘీని!

Advertisement

Next Story