రూ. 10 లక్షల కోట్లకు భారత ప్లాస్టిక్ పరిశ్రమ!

by Dishaweb |
రూ. 10 లక్షల కోట్లకు భారత ప్లాస్టిక్ పరిశ్రమ!
X

చెన్నై: భారత్ త్వరలో ప్రపంచ ప్లాస్టిక్ సరఫరాదారుగా మారనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో ప్లాస్టిక్ వృద్ధితో పాటు విదేశాలకు ఎగుమతులు కూడా పెరగనున్నాయని ఆల్ ఇండియా ప్లాస్టిక్ మాన్యూఫాక్చరింగ్ అసోసియేషన్(ఏఐపీఎంఏ) అభిప్రాయపడింది. ఏఐపీఈంఏ ఆదివారం నిర్వహించిన టెక్నాలజీ సదస్సు ఐదవ ఎడిషన్‌ సందర్భంగా మాట్లాడిన అధికారులు 2027-28 నాటికి భారత ప్లాస్టిక్ మార్కెట్ మూడు రెట్లు పెరిగి రూ. 10 లక్షల కోట్లకు చేరుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం ఈ మార్కెట్ రూ. 3.5 లక్షల పరిమాణం కలిగి ఉంది. భారత్ నుంచి ప్లాస్టిక్ ఎగుమతులు సైతం రూ. 40,000 కోట్ల నుంచి రూ. లక్షల కోట్లకు చేరుకుంటాయని ఏఐపీఎంఏ అంచనా వేసింది. దేశీయ ప్లాస్టిక్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉందని ఏఐపీఎంఏ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ అరవింద్ మెహతా చెప్పారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ ఎదగడంలో ప్లాస్టిక్ పరిశ్రమ కీలకంగా ఉండనుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed