- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాది భారత వృద్ధి 6.5 శాతం: సంజీవ్ సన్యాల్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవ్యవస్థ దాదాపు 6.5 శాతం వృద్ధి చెందనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా కొనసాగుతున్న ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ అన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి అనిశ్చితిలో ఉన్నప్పటికీ, భారత్ ఇతర ఆర్థికవ్యవస్థల కంటే చాలా మెరుగ్గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆసియా అభివృద్ధి బ్యాంకుతో పాటు ప్రపంచ బ్యాంకు, ద్రవ్య నిధి సంస్థ భారత్ వృద్ధి అంచనాను తగ్గించాయి.
అయినప్పటికీ వేగవంతమైన అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ ఉంటుందని తెలిపారు. 'వివిధ సంస్థలు వృద్ధి అంచనాను సవరించినప్పటికీ ఈ ఏడాది ప్రారంభంలో తమ ఆర్థిక సర్వే ప్రకారం, 6.5 శాతం మేర వృద్ధికి ఆస్కారం ఉందనే నమ్మకం ఉంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల మధ్య ఇది అత్యంత సానుకూల వృద్ధి' అని సంజీవ్ వెల్లడించారు. దేశీయంగా చేపట్టిన సంస్కరణలతో వృద్ధి మరింత ఎక్కువగా ఉండాల్సింది అని, ప్రపంచ మందగమన పరిణామాల కారణంగా ఆరున్నర శాతానికి పరిమితమవుతోందని ఆయన పేర్కొన్నారు.
Also Read