- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ISMR: రేపు భారత్-సింగపూర్ మంత్రుల సమావేశం
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్-సింగపూర్ మధ్య వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే ఉద్దేశ్యంతో సోమవారం(ఆగస్టు 26) ఇరు దేశాల మంత్రుల మధ్య రౌండ్ టేబుల్ సమావేశం సింగపూర్‌లో జరగనుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. దీనికి భారత్ తరపున నలుగురు కేంద్ర మంత్రులు హాజరవుతారు, వారు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ మంత్రులు సింగపూర్ మంత్రులతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్ అవకాశాలు, దాని డైనమిక్ వృద్ధి పథాన్ని వివరించనున్నారు.
భారతదేశం-సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ (ISMR) ప్రారంభ సమావేశం సెప్టెంబర్ 2022లో న్యూఢిల్లీలో జరిగింది. దీనిని రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల కోసం రూపొందించారు. భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి సింగపూర్ ప్రధాన వనరుగా ఉంది. 2023-24లో, సింగపూర్ భారతీయ మార్కెట్లలోకి $11.77 బిలియన్ల పెట్టుబడులను పెట్టింది. అదే ఏప్రిల్ 2000 నుండి మార్చి 2024 వరకు దాదాపు $159.94 బిలియన్లు ఇన్వెస్ట్‌మెంట్లు వచ్చాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో, సింగపూర్ 2023-24లో మొత్తం $35.61 బిలియన్ల వాణిజ్యంతో భారతదేశానికి ఆరవ అతిపెద్ద ప్రపంచ వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇదే సమయంలో భారతదేశ ఎగుమతులు సింగపూర్‌కు 14.41 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 21.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.