- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Edible Oil: వంటనూనెలపై దిగుమతి సుంకం పెంచిన కేంద్రం
దిశ, బిజినెస్ బ్యూరో: వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక రైతులను ఆదుకునేందుకు ముడి, శుద్ధి చేసిన వంటనూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకం 20 శాతం పెంచుతున్నట్టు ప్రభుత్వం శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా వంటనూనె ధరలు తగ్గొచ్చు, తద్వారా డిమాండ్‌పై ప్రభావం ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా విదేశాల్లో పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గిస్తుందన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారం.. సెప్టెంబర్ 14 నుంచి క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయా ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌లపై 20 శాతం బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని విధించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వంటనూనెలపై అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్ కూడా విధించిన కారణంగా వీటిపై మొత్తం దిగుమతి సుంకం 5.5 శాతం నుంచి 27.5 శాతానికి పెరుగుతుంది. అలాగే శుద్ధి చేసిన పామాయిల్, సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై గతంలో ఉన్న 13.75 శాతం నుంచి 35.75 శాతానికి పెరుగుతుంది. భారత్ దేశీయ వెజిటబుల్ ఆయిల్ డిమాండ్‌లో 70 శాతం కంటే ఎక్కువ దిగుమతుల ద్వారా తీరుస్తోంది. ఇది ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్‌ను కొనుగోలు చేస్తోంది. ఇక, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది.