- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాజిస్టిక్ పనితీరు సూచీలో ఆరు స్థానాలు ఎగబాకిన భారత్!
న్యూఢిల్లీ: లాజిస్టిక్ పనితీరు సూచీలో భారత్ మెరుగైన ర్యాంకును సాధించింది. మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ రెండింటిలోనూ గణనీయమైన పెట్టుబడుల ఫలితంగా 2023 ఏడాదికి గానూ లాజిస్టిక్ పనితీరు సూచీ(ఎల్‌పీఐ)లో భారత్ ఆరు స్థానాలు ఎగబాకి 38వ స్థానంలో నిలిచింది. మొత్తం 139 దేశాలకు గానూ ప్రపంచ బ్యాంకు ఈ ర్యాంకులను ఇస్తుంది. 2018 సమయంలో భారత్ ఈ జాబితాలో 44వ ర్యాంకును కలిగి ఉంది. అదే 2014లో 54వ ర్యాంకు నుంచి గణనీయంగా మెరుగుపడి ప్రస్తుతం 38కి మెరుగుపడటం విశేషం.
ప్రధానంగా కేంద్రం లాజిస్టిక్స్ రంగంలో ఖర్చును తగ్గించేందుకు చేపట్టిన పలు చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. 2024-25 నాటికి ఆర్థికవ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం లాజిస్టిక్ వ్యయాన్ని తగ్గించే లక్ష్యాన్ని నిర్దేశించింది. అందులో భాగంగానే 2021లో మల్టీమోడల్ కనెక్టివిటీతో పీఎం గతిశక్తి కార్యక్రమాన్ని ప్రకటించారు. గతేడాది లాస్ట్-మైల్ డెలివరీ, రవాణా సంబంధిత సవాళ్లను అధిగమించడం, తయారీ రంగంలో సమయం, డబ్బు ఆదా, లాజిస్టిక్ రంగం కోసం నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.