లిథియం నిల్వల ద్వారా ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్: గడ్కరీ!

by Harish |
లిథియం నిల్వల ద్వారా ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్: గడ్కరీ!
X

న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ మార్కెట్, ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగే అవకాశాన్ని కలిగి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. గతేడాదిలోనే మనం జపాన్‌ను దాటి మూడో అతిపెద్ద వాహన మార్కెట్‌గా నిలిచామన్నారు. శుక్రవారం జరిగిన పరిశ్రమల సంఘం సీఐఐ నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన, ఇటీవల జమ్మూకశ్మీర్‌లో గుర్తించిన లిథియం నిల్వలను మనం ఉపయోగించగలిగితే ఆటోమొబైల్ తయారీలో ప్రపంచ నంబర్ వన్‌గా నిలవగలమని చెప్పారు.

ప్రస్తుతం ఏడాదికి 1,200 టన్నుల లిథియంను భారత్ దిగుమతి చేసుకుంటోంది. మనకున్న లిథియంను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే అమెరికా, చైనాలను అధిగమించి అగ్రస్థానానికి చేరుకోగలం. దేశాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కావాలని, అందుకోసం ప్రజా రవాణా, ఎలక్ట్రిక్ బస్సులకు తగిన ప్రోత్సాహం అవసరమని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ. 7.5 లక్షల కోట్లు, మొత్తం జీఎస్టీ ఆదాయంలో ఈ రంగం సహకారం అత్యధికంగా ఉందని గడ్కరీ చెప్పారు.

Advertisement

Next Story