- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
IMF: 2027 నాటికి మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్: గీతా గోపీనాథ్
దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థ అంచనాల కంటే మెరుగ్గా వృద్ది చెందుతుందని, ఇదే విధంగా ఉన్నట్లయితే 2027 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి మొదటి డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ అన్నారు. ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో ఊహించిన దానికంటే భారత వృద్ధి చాలా మెరుగ్గా ఉంది. దీనిని ఇలాగే కొనసాగించడానికి తీసుకునే చర్యలు ఈ సంవత్సరం మా అంచనాను ప్రభావితం చేస్తాయి. అలాగే, ప్రైవేట్ వినియోగం కూడా కోలుకోవడం కనిపించిందని ఆమె అన్నారు.
ప్రైవేట్ వినియోగ వృద్ధి 4 శాతం పెరిగింది. గ్రామీణ వినియోగం పుంజుకుంది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్ సేల్స్‌లో వృద్ధి కనిపిస్తుంది. మెరుగైన రుతుపవనాల కారణంగా ఈ సారి పంటలు బాగా పండుతాయని ఆమె అంచనా వేశారు. ఐఎంఎఫ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి రేటును 7 శాతానికి పైగా అంచనా వేసింది. ఇది ఈ ఏడాది ఆర్థిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిన 6.5 శాతం కంటే ఎక్కువ.