యూరప్‌కు అతిపెద్ద శుద్ధి చేసిన చమురు సరఫరాదారుగా భారత్!

by Vinod kumar |
యూరప్‌కు అతిపెద్ద శుద్ధి చేసిన చమురు సరఫరాదారుగా భారత్!
X

న్యూఢిల్లీ: భారత్ అరుదైన రికార్డును సాధించింది. యూరప్‌లోని దేశాలకు శుద్ధిచేసిన ఇంధనాన్ని సరఫరా చేసే అతిపెద్ద దేశంగా అవతరించింది. ఇదే సమయంలో రష్యా నుంచి ముడి చమురును రికార్డు స్థాయిలో కొనుగోలు చేసిన దేశంగా కూడా నిలిచింది. ఈ మేరకు ప్రముఖ అనలిటిక్ సంస్థ కెప్లర్ వెల్లడించింది. గతేడాది ప్రారంభం నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తున్న నేపథ్యంలో రష్యాపై యూరప్ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే రష్యా నుంచి చమురును కూడా దిగుమతి చేసుకోవడంలేదు. దానికి బదులుగా శుద్ధి చేసిన చమురును భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.

అందుకే భారత ముడి చమురు ఉత్పత్తులపై యూరప్ ఆధారపడటం పెరిగింది. ఈ పరిణామాలు భారత్‌కు కలిసి రావడంతో అతిపెద్ద సరఫరాదారుగా ఎదిగింది. మన దేశం నుంచి యూరప్ రోజుకు 3,60,00 బ్యారెళ్ల శుద్ధి చేసిన ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది సౌదీ కంటే కొంచెం తక్కువ. అలాగే, ఏర్పిల్‌కు సంబంధించి రష్యా నుంచి భారత్ రోజుకు 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటుందని కెప్లర్ డేటా అంచనా వేసింది. ఇది దేశ మొత్తం దిగుమతుల్లో 44 శాతానికి సమానమని కెప్లర్ నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story