- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ అద్భుతమైన మార్కెట్: యాపిల్ సీఈఓ టిమ్ కుక్!
వాషింగ్టన్: ఇటీవల దేశీయంగా తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ భారత మార్కెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాపిల్ ఉత్పత్తులకు భారత్ అద్భుతమైన మార్కెట్ అని, భారత్‌లో వ్యాపారంపై కంపెనీ దృష్టి సారించినట్టు టిమ్‌కుక్ తెలిపారు. కంపెనీ త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా మాట్లాడిన ఆయన, గతంలో కంటే ప్రస్తుతం భారత్‌లో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా పెరిగాయి. వారు ఐఫోన్‌లను కొనే అవకాశం ఉంటుందన్నారు.
ఇక్కడి వ్యాపారం కీలక దశలు చేరుకున్న నేపథ్యంలో ఐఫోన్‌తో పాటు ఇతర యాపిల్ ఉత్పత్తులకు మరింత గిరాకీ ఏరపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల మార్చితో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి భారత మార్కెట్లో నమోదైన రికార్డు స్థాయి వృద్ధి దీనికి సంకేతమని చెప్పారు. వార్షిక ప్రాతిపదికన వృద్ధి రెండంకెల స్థాయిలో ఉండగా, ఇటీవల భారత పర్యటన సందర్భంగా ప్రజల్లో యాపిల్ ఉత్పత్తుల పట్ల ఆదరణను స్వయంగా చూశానని వెల్లడించారు. కాగా, గత నెల టిమ్ కుక్ భారత్‌లో రెండు రిటైల్ స్టోర్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశీయంగా విక్రయాలతో పాటు తయారీపై కూడా యాపిల్ సంస్థ భారత్‌కు ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతానికి దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఐఫోన్ వాటా 6 శాతం ఉంది.
Also Read...