- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Budget 2024: సబ్సిడీలకు రూ.3.81 లక్షల కోట్లు.. గతంతో పోలిస్తే 7.8% తగ్గింపు
దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పలు రంగాల రాయితీలకు కోత విధించారు. గతంతో పోలిస్తే ప్రభుత్వం.. ఆహారం, ఎరువులు, ఇంధనం సబ్సిడీల కోసం చేస్తున్న ఖర్చులను దాదాపు 7.8 శాతం తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మొత్తం సబ్సిడీ కేటాయింపులు రూ. 3,81,175 కోట్లుగా ఉన్నాయి, ఇది అంతకుముందు సంవత్సరం రూ. 4,13,466 కోట్లుగా ఉంది. ఈ తగ్గింపు కూడా ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్‌లో అంచనా వేసిన అంచనాలకు అనుగుణంగా ఉంది.
కేటగిరీల వారీగా చూస్తే, ఆహార సబ్సిడీకి రూ. 2,05,250 కోట్లు కేటాయించారు, ఇది మార్చి 31, 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో రూ.212,332 కోట్ల నుండి తగ్గింది. ఈ సబ్సిడీ ప్రభుత్వం సేకరించిన ఆహార ధాన్యాల ఆర్థిక వ్యయం, జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA), ఇతర సంక్షేమ పథకాల కింద వచ్చిన ఆదాయ వ్యత్యాసాన్ని కవర్ చేస్తుంది, దీని ద్వారా సుమారు 80 కోట్ల మంది ప్రయోజనం పొందుతారు.
ఎరువుల సబ్సిడీపై కూడా భారీగా కోత విధించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల రాయితీ కోసం రూ.1,88,894 కోట్లు కేటాయించగా, ఈసారి అది రూ.1,64,000 కోట్లకు తగ్గింది. ఇది డీఏపీ, ఎంఓపీ వంటి యూరియా, యూరియాయేతర ఎరువులు రెండింటినీ కవర్ చేస్తూ రైతులకు తక్కువ ధరలను ఉత్పత్తులను అందించడంలో తయారీదారులకు మద్దతునిస్తోంది. ఇంకా పెట్రోలియం, వంట గ్యాస్ (LPG) సబ్సిడీల కోసం గత ఏడాది రూ.12,240 కోట్లు కేటాయించగా, ఈ సారి అది స్వల్పంగా రూ.11,925 కోట్లకు తగ్గింది.