- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ ఆర్థిక సంవత్సరం గ్రామాల్లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలు: హ్యుందాయ్
దిశ, బిజినెస్ బ్యూరో: అనుకూలమైన రుతుపవనాలు, ఇతర అంశాల వలన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల నుండి అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని, ఈ ప్రాంతాల నుంచి 20 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్టు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ గత ఏడాది గ్రామీణ విక్రయాల్లో 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. పట్టణాల్లో ఇది 4 శాతంగా ఉంది. ఈ ఏడాది మా అమ్మకాలు మరింత పెరుగుతాయని కంపెనీ సీఓఓ తరుణ్ గార్గ్ అన్నారు.
దేశం అభివృద్ధి చెందాలంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండూ సమష్టిగా పురోగమించాలని దృఢంగా విశ్వసిస్తున్నందున చిన్న పట్టణాలలో తమ ఉనికిని మరింత విస్తరించాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎఫ్‌వై23లో కంపెనీ మొత్తం అమ్మకాలలో గ్రామీణ విక్రయాలు ఆల్ టైమ్ హై 19 శాతంగా ఉన్నాయి, గ్రామీణ వినియోగదారుల్లో పెరుగుతున్న కొనుగోలు శక్తి, అభివృద్ధి చెందుతున్న ఆకాంక్షలకు ఇది కూడా నిదర్శనమని గార్గ్ పేర్కొన్నారు. కంపెనీ 8 శాతం వృద్ధితో 2023-24లో అత్యధికంగా 7,77 876 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. అదే ఎఫ్‌వై24లో 6,14,721 యూనిట్ల అత్యధిక దేశీయ విక్రయాలను కూడా నివేదించింది.