మొదటి ఎస్‌యూవీ మోడల్ 'ఎలివేట్' కారును విడుదల చేసిన హోండా..!

by Shiva |
మొదటి ఎస్‌యూవీ మోడల్ ఎలివేట్ కారును విడుదల చేసిన హోండా..!
X

న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా తన సరికొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ మోడల్ 'ఎలివేట్' కారును సోమవారం మార్కెట్లో విడుదల చేసింది. ఈ విభాగంలో హోండా కంపెనీకి ఇదే మొదటి కారు కావడం విశేషం. దీని ధర రూ.10.99 లక్షల నుంచి రూ.15.99 లక్షల మధ్య నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో తీసుకొచ్చిన ఈ కారు సిక్స్-స్పీడ్ మాన్యూవల్, సెవెన్-స్పీడ్ సీవీటీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 15.31 కి.మీ మైలేజీ ఇస్తుందని, సీవీటీ వేరియంట్ 16.92 కి.మీ మైలేజీ ఇస్తుంది. 458 లీటర్ల కార్గో స్పేస్ కలిగిన ఎలివేట్ మోడల్ ఏడు సింగిల్ టోన్ రంగుల్లో, మూడు డ్యూయెల్ టోన్ రంగుల్లో లభిస్తుంది. ఫీచర్ల పరంగా, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, పానరోమిక్ సన్‌రూఫ్, డ్యూయెల్ క్లైమెట్ కంట్రోల్, వైర్‌లెస్ కార్ కనెక్ట్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. అదేవిధంగా, ఆరు ఎయిర్‌బ్యాగులు, స్పీడ్ వార్నింగ్, పార్కింగ్ సెన్సాల్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిటెన్స్ సిస్టమ్ లాంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయని కంపెనీ వివరించింది.

మూడేళ్ల అన్‌ లిమిటెడ్ కిలో మీటర్ వారెంటీ, ఐదేళ్ల ఎక్స్‌డెంటెడ్ వారెంటీ, పదేళ్ల రోడ్-సైడ్ అసిస్టెన్స్ సౌకర్యం ఉంటుందని పేర్కొంది. ఇక, రాబోయే మూడేళ్లలో బ్యాటరీ-ఎలక్ట్రిక్ వెర్షన్ తెచ్చే యోచనలో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో 2030 నాటికి కొత్తగా ఐదు ఎస్‌యూవీ మోడళ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా కంపెనీ తెలిపింది. భారత మార్కెట్లో వేగంగా పెరుగుతున్న ఎస్‌యూవీ విభాగంలో మార్కెట్ వాటా పెంచుకునే లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed