పెరగనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణాలు!

by Vinod kumar |
పెరగనున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రుణాలు!
X

పూణె: ప్రైవేట్‌ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల(ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన రేట్లు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ఎంసీఎల్ఆర్ రేటు పెంపు కారణంగా వినియోగదారులు తీసుకునే గృహ, వ్యక్తిగత, వాహన రుణాలపై వడ్డీ రేట్ల ప్రభావితం ఉంటుంది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ప్రధానంగా ఖాతాదారులు తీసుకునే అన్ని రకాల రుణాలపై ఎక్కువగా ప్రభావితం చేసే ఏడాది కాలవ్యవధిపై ఎంసీఎల్ఆర్ రేటును 9.05 శాతం వద్దే స్థిరంగా ఉంచింది.

ఇక, ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటును 15 బేసిస్ పాయింట్లు పెంచి 8.10 శాతానికి చేర్చింది. నెల రోజుల కాలవ్యవధిపై ఎంసీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచి 8.20 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 8.40 శాతం నుంచి 8.50 శాతానికి పెంచింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్‌ను 8.80 శాతం నుంచి 8.85 శాతానికి పెంచింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్‌ను 9.10 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్‌ను 9.20 శాతంగా బ్యాంకు నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed