GST Council: ఆరోగ్య, జీవిత బీమాలపై పన్నురేట్ల సమీక్షకు మంత్రుల బృందం ఏర్పాటు

by S Gopi |
GST Council: ఆరోగ్య, జీవిత బీమాలపై పన్నురేట్ల సమీక్షకు మంత్రుల బృందం ఏర్పాటు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీ రేటును సూచించేందుకు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను రేట్లను సమీక్షించేందుకు 13 మంది సభ్యులతో కూడిన మంత్రుల బృందాన్ని(జీఓఎం) ఏర్పాటు చేస్తూ ఆదివారం నిర్ణయించింది. ఈ బృందం అక్టోబర్ 30లోగా నివేదికను సమర్పించనుంది. ఈ బృందానికి బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్యానెల్ సభ్యులుగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, మేఘాలయ, పంజాబ్, తమిళనాడు, తెలంగాణలకు చెందిన మంత్రులు ఉండనున్నారు. ఈ నెల 9న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై జీఎస్టీ విధానాన్ని పరిశీలించేందుకు, సమీక్షించేందుకు జీఓఎంను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏర్పాటైన జీఓఎం బృందం నివేదిక ఆధారంగా నవంబర్‌లో జరిగే తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో బీమా ప్రీమియంలపై పన్ను గురించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Next Story