GST Collection: నవంబర్‌లో రూ. 1.82 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం

by S Gopi |
GST Collection: నవంబర్‌లో రూ. 1.82 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వస్తు, సేవల పన్ను వసూళ్లు(జీఎస్టీ) మరోసారి అత్యధికంగా నమోదయ్యాయి. ప్రధానంగా దేశీయ లావాదేవీల ద్వారా అధిక రాబడితో నవంబర్‌లో రూ. 1.82 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఇది గతేడాది కంటే 8.5 శాతం పెరిగినట్టు ఆదివారం ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. మొత్తం వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ రూ. 34,141 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ. 43,047 కోట్లు, ఐజీఎస్టీ రూ. 91,828 కోట్లు, సెస్ రూ. 13,253 కోట్లుగా ఉన్నాయని గణాంకాలు వెల్లడించాయి. గత నెలలో వసూలైన జీఎస్టీ ఇప్పటివరకు మూడో అత్యధికం. ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో రూ. 2.10 లక్షల కోట్ల జీఎస్టీ రాబడి ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. ఆ తర్వాత అక్టోబర్‌లో రూ. 1.87 లక్షల కోట్ల రాబడి వచ్చింది. గతేడాది నవంబర్‌లో వచ్చిన మొత్తం కంటే ఈసారి 8.5 శాతం ఎక్కువ జీఎస్టీ ఆదాయం నమోదైంది. సమీక్షించిన నెలలో దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ 9.4 శాతం పెరిగి రూ. 1.40 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతులపై పన్ను ద్వారా వచ్చే ఆదాయం 6 శాతం వృద్ధితో రూ. 42,591 కోట్లు వచ్చాయి.

Advertisement

Next Story

Most Viewed