Gravton Motors: గ్రావ్టోన్ మోటార్స్ నుంచి కొత్త ఈవీ బైక్ లాంచ్.. ధర ఎంతంటే..?

by Maddikunta Saikiran |
Gravton Motors: గ్రావ్టోన్ మోటార్స్ నుంచి కొత్త ఈవీ బైక్ లాంచ్.. ధర ఎంతంటే..?
X

దిశ,వెబ్‌డెస్క్: భారతదేశంలో ప్రస్తుతం విద్యుత్ వాహనాల(EV)కు డిమాండ్ వేగంగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది వీటిని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు చాలా కంపెనీలు దేశీయ వాహన మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఎలక్ట్రికల్ వెహికల్స్(Electrical Vehicles)ను లాంచ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ కంపెనీ గ్రావ్టోన్ మోటార్స్(Gravton Motors) నుంచి కొత్త ఈవీ బైక్(EV Bike) రిలీజ్ అయ్యింది. క్వాంటా ఎలక్ట్రిక్(Quanta Electric) పేరుతో దీన్ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. రూ.1,20,000(Ex-Showroom) ప్రారంభ ధరతో దీన్ని మార్కెట్లో ప్రవేశపెట్టారు.

ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. లిథియం మాంగనీస్ ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీతో వస్తున్న తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇది. ఇందులో 2.78 కిలో వాట్ల(Kwh) బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 130 కిలో మీటర్లు వెళ్తుంది. గంటకు 75 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్(Full Charge) కావడానికి 90 నిమిషాల టైం తీసుకుంటుంది. ఈ మోటార్‌సైకిల్‌లో ప్రత్యేకమైన మొబైల్ యాప్(Mobile App) ద్వారా యాక్సెస్ చేయగల లేటెస్ట్ కనెక్టివిటీ ఫీచర్‌లు ఉన్నాయి. వినియోగదారులు ఈ యాప్ ద్వారా బ్యాటరీ హెల్త్(Battery Health), ఛార్జింగ్ స్టేటస్(Charging Status) వంటివి చెక్ చేసుకోవచ్చు. అలాగే రిమోట్ స్టార్ట్/స్టాప్ ఫంక్షనాలిటీ, వెహికల్ ట్రాకింగ్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్‌లను ఈ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

Advertisement

Next Story