Patanjali Foods: పతంజలి ఫుడ్స్‌లో 1.24 శాతం వాటా కొనుగోలు చేసిన జీక్యూజీ పార్ట్‌నర్స్

by S Gopi |
Patanjali Foods: పతంజలి ఫుడ్స్‌లో 1.24 శాతం వాటా కొనుగోలు చేసిన జీక్యూజీ పార్ట్‌నర్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ జీక్యూజీ పార్ట్‌నర్స్‌ శుక్రవారం దేశీయ ఎఫ్ఎంసీజీ పతంజలి ఫుడ్స్‌లో 1.24 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 835 కోట్లు. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం.. ఇప్పటికే పతంజలి ఫుడ్స్‌లో జీక్యూజీ పార్ట్‌నర్స్‌కు 3.19 శాతం వాటా ఉంది. తాజా కొనుగోలులో భాగంగా 45.03 లక్షల షేర్లను కొనడంతో వాటా 4.43 శాతానికి పెరిగింది. ఈ షేర్లను జీక్యూజీ పార్ట్‌నర్స్ సగటున రూ.1,854తో కొనుగోలు చేసింది. వాటా విక్రయం తర్వాత పతంజలి ఫుడ్స్ ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్‌ల వాటా 72.81 శాతం నుంచి 70.1 శాతానికి తగ్గింది. శుక్రవారం స్టాక్ మార్కెట్లలో పతంజలి ఫుడ్స్ షేర్ ధర 3.75 శాతం క్షీణించి రూ.1,858.90 వద్ద ముగిసింది. కాగా, జీక్యూజీ పార్ట్‌నర్స్ గత నెలలోనూ జీఎంఅర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాలో సైతం రూ. 433 కోట్ల విలువైన 5.17 శాతానికి వాటాను పెంచుకుంది.

Advertisement

Next Story