- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వొడాఫోన్ ఐడియాలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్న జీక్యూజీ పార్ట్‌నర్స్
దిశ, బిజినెస్ బ్యూరో: అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులతో దేశీయంగా వార్తల్లోకెక్కిన ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్ ఎల్ఎల్‌సీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. దేశీయ టెలికాం రంగంలో ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ రంగ వొడాఫోన్ ఐడియాలో జీక్యూజీ పార్ట్‌నర్స్ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ వారం ఆఖరులో ప్రారంభమయ్యే వొడాఫోన్ ఐడియా వాటా విక్రయ ప్రక్రియలో పాల్గొని 400 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 3,343 కోట్లు) పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. వొడాఫోన్ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్‌ల జాయింట్ వెంచర్ ద్వారా మొదలవనున్న ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్‌లో ఈక్విటీల కోసం జీక్యూజీ బిడ్ వేయనుంది. ప్రస్తుతానికి దీని గురించి కంపెనీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ నెల 18-22 తేదీల మధ్య వొడాఫోన్ ఐడియా 2.2 బిలియన్ డాలర్ల షేర్లను విక్రయించనుంది. ఒక్కో షేర్‌కు రూ. 10 కు విక్రయించనున్నట్టు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.