- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వచ్చే నెలలో షిప్పింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణకు ఆర్థిక బిడ్లు!
న్యూఢిల్లీ: షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌సీఐ) ప్రైవేటీకరణ కోసం వచ్చే నెలలో ఆర్థిక బిడ్లను ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రభుత్వాధికారులు తెలిపారు. నియంత్రణాపరమైన కారణాలతో కొంత జాప్యం తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ విక్రయ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తోంది. 2019లో ఎస్‌సీఐలో ప్రభుత్వం తన వాటా విక్రయంతో సహా అనేక ప్రభుత్వరంగ కంపెనీలను ప్రైవేటీకరించే ప్రణాళికలను ప్రకటించింది. అయితే, ఆస్తుల బదలాయింపు ప్రక్రియ ఆలస్యమవడంతో గతంలో ఈ ప్రయత్నాలను నిలిపివేసింది.
తాజాగా, ఈ ఏడాది మే నాటికి ఎస్‌సీఐ కోసం ఆర్థిక బిడ్లను ఆహ్వానించాలని ప్రయత్నిస్తోందని, ఏప్రిల్ 14న కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ప్యానెల్ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుందని ఇద్దరు ప్రభుత్వ అధికారులు రాయిటర్స్‌తో చెప్పారు. ఎస్‌సీఐలో 63.75 శాతం వాటాల విక్రయానికి ప్రభుత్వం తన నాన్-కోర్ ఆస్తుల బదలాయింపు చేపట్టాల్సి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తర్వాత, ఎస్‌సీఐ గత నెలలో దాని అప్రధాన ఆస్తుల బదిలీని విజయవంతంగా పూర్తి చేసింది. ఫలితంగా ఏప్రిల్ 23లోపు ఎస్‌సీఐ ల్యాండ్ అండ్ అసెట్స్ లిమిటెడ్ సంస్థను లిస్టింగ్ చేయాలి. అనంతరం మే మధ్య నాటికి ఎస్‌సీఐ కోసం ఆర్థిక బిడ్లను ఆహ్వానించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అధికారులు తెలిపారు. అయితే, దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించలేదు. ఈ వ్యవహారానికి సంబంధించి అధికారికంగా స్పందించాల్సి ఉంది.