రాబోయే బడ్జెట్‌లో క్రిప్టోకరెన్సీని పన్ను పరిధిలోకి తెచ్చే అవకాశం!

by Disha News Desk |
రాబోయే బడ్జెట్‌లో క్రిప్టోకరెన్సీని పన్ను పరిధిలోకి తెచ్చే అవకాశం!
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే 2022-23 కేంద్ర బడ్జెట్లో నిర్దిష్ట పరిమితికి మించి క్రిప్టోకరెన్సీ అమ్మకం, కొనుగోళ్లపై టీడీఎస్/టీసీఎస్ విధించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆదాయపు పన్ను పరిధిలోకి తెచ్చేందుకు క్రిప్టో లావాదేవీలను నిర్ధిష్ట పరిధిలోకి తీసుకురావాలని నాంగియా ఆండర్సన్‌ ఎల్ఎల్‌పీకి చెందిన అరవింద్ శ్రీవత్సన్ అన్నారు. అంతేకాకుండా గేమ్‌షోలు, లాటరీ, పజిల్స్ లాంటి వాటి ద్వారా వచ్చే వాటి పై విధించే విధంగా క్రిప్టోకరెన్సీ అమ్మకాలపై వచ్చే ఆదాయంపై 30 శాతం అధిక పన్ను రెటు విధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మరో రెండు వారాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఈ నేపథ్యంలో ఒక నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ కలిగిన వారు 10 కోట్ల మందికి పైనే ఉన్నారు. అలాగే, 2030 నాటికి క్రిప్టోకరెన్సీ లో భారతీయుల పెట్టుబడులు దాదాపు రూ. 1,500 కోట్లను మించిపోవచ్చని అంచనా. ఇప్పటికే బడ్జెట్ సమావేశాల్లో క్రిప్టో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒకవేళ ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల నిషేధం ఉండకపోతే పన్ను విధింపు అంశంపై స్పష్టత ఉండొచ్చని అరవింద్ శ్రీవత్సన్ పేర్కొన్నారు. మార్కెట్ పరిమాణం, ఎంత పెట్టుబడి ఉంది లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని క్రిప్టోకరెన్సీలను మూలం వద్ద పన్ను చెల్లింపు (టీడీఎస్‌), మూలం వద్ద పన్ను వసూలు (టీసీఎస్‌) నిబంధనల పరిధిలోకి తీసుకురావొచ్చన్నారు.

Advertisement

Next Story

Most Viewed