- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈవీ ఫేమ్2 పొడిగింపుపై కేంద్రం స్పష్టత
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో విద్యుత్తు వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫేమ్-2 పథకాన్ని పొడిగిస్తున్నట్టు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పథకం 2024, మార్చి 31తో ముగియనుంది. అయితే ఈ గడువు తర్వాత ఎలాంటి పొడిగింపు నిర్ణయం తీసుకోలేదని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటనలో వెల్లడించింది. ఫేమ్ పథకం రెండవ దశ కింద సబ్సిడీ మార్చి ఆఖరు వరకు లేదా నిధులు అందుబాటులో ఉన్నవంత వరకు వర్తిస్తుంది. ఇప్పటికే ఈ పథకం కోసం వ్యయాన్ని రూ. 10,000 కోట్ల నుంచి రూ. 11,500 కోట్లకు పెంచినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాబట్టి తదుపరి పొడిగింపు విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. కాగా, గురువారం ఉదయం ఫేమ్-2 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో నాలుగు నెలలు పొడిగిస్తున్నట్లు, దీనికోసం అదనంగా రూ.500 కోట్లు కేటాయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ కారణంగానే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.