ముడి పెట్రోలియంపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించిన కేంద్రం!

by Harish |
ముడి పెట్రోలియంపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను తగ్గించిన కేంద్రం!
X

న్యూఢిల్లీ: ఇటీవల కేంద్రం దేశీయ ముడి చమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. తాజాగా ముడు పెట్రోలియంపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. టన్నుకు రూ. 6,400 నుంచి రూ. 4,100కి తగ్గిస్తూ, ఇది మంగళవారం నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దాంతో టన్నుకు రూ.2300 మేర తగ్గింది. అయితే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనంపై ఇప్పటికీ విండ్‌ఫాల్ టాక్స్ సున్నాగానే ఉంది.

ప్రస్తుతం కేవలం ముడి పెట్రోలియంపై మాత్రమే విండ్‌ఫాల్ టాక్స్ వర్తిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 4న ముడి పెట్రోలియంపై విండ్‌ఫాల్ టాక్స్‌ను రూ.3500 నుంచి సున్నాకు చేర్చింది. కానీ కొద్ది రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయంగా రేట్లు పెరగడంతో మళ్లీ సున్నా నుంచి ఏప్రిల్ 19న రూ. 6400 కు పెంచింది. ఇప్పుడు మళ్లీ కొంత మేర తగ్గించింది.

కాగా, దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురు పైన, చమురు ఎగుమతులపై గతేడాది జులై 1 నుంచి ప్రభుత్వం విండ్‌ఫాల్‌ పన్ను విధిస్తోంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా 15 రోజులకోసారి దీన్ని సవరిస్తోంది. ఎగుమతుల వల్ల కంపెనీలు అదనపు లాభాలు పొందుతున్న కారణంగానే ఈ ట్యాక్స్‌ను కొత్తగా తీసుకొచ్చింది.

Advertisement

Next Story