- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2,500 మోసపూరిత లోన్ యాప్‌ల తొలగింపు
న్యూఢిల్లీ: 2021, ఏప్రిల్ నుంచి 2022, జూలై మధ్య గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి 2,500 మోసపూరిత లోన్ యాప్‌లను రద్దు లేదా తొలగించిందని ప్రభుత్వం వెల్లడించింది. మోసపూరిత లోన్ యాప్‌ల కట్టడికి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ), ఇతర నియంత్రణ సంస్థలతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. సమాజంలో సైబర్ సెక్యూరిటీని పెంచడం, అటువంటి మోసాలను తగ్గించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. మోసపూరిత లోన్ యాప్‌లను నియంత్రించేందుకు ఆర్‌బీఐ చట్టపరమైన అనుమతి ఉన్న లోన్ యాప్‌ల వివరాలను ప్రభుత్వానికి అందజేసిందని, దీన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్‌తో పంచుకుందని, తద్వారా మోసపూరితమైన వాటిని కట్టడి చేసినట్టు నిర్మలా సీతారామన్ వివరించారు. గూగుల్ ప్లే స్టోర్ సైతం తన పాలసీ విధానాలను అప్‌డేట్ చేసిందని, దేసీయ లోన్ యాప్‌ల కోసం కఠినమైన చర్యలతో అదనపు పాలసీ వివరాలను అమలు చేస్తోందని వెల్లడించారు.