Jio Freedom Offer:‘జియో ఎయిర్ ఫైబర్’ యూజర్లకు గుడ్‌న్యూస్

by Jakkula Mamatha |
Jio Freedom Offer:‘జియో ఎయిర్ ఫైబర్’ యూజర్లకు గుడ్‌న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్:జియో వినియోగదారులకు భారీ గుడ్ న్యూస్. ‘జియో ఎయిర్ ఫైబర్’ యూజర్లకు తాజాగా జియో శుభవార్త చెప్పింది. ఇటీవల జియో రీఛార్జ్ ప్లాన్స్ పెంచిన విషయం తెలిసిందే. ‘జియో ఫ్రీడమ్ ఆఫర్’ పేరిట ఇన్‌స్టలేషన్ ఛార్జీలు లేకుండానే కొత్త జియో ఎయిర్‌ ఫైబర్ కనెక్షన్‌ను అందించనున్నట్టు జియో ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొత్త కనెక్షన్‌ను పొందాలనుకునే నూతన యూజర్లకు ఈ ఆఫర్ ఉపయోగపడుతోంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్‌‌గా చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కనెక్షన్ తీసుకున్న యూజర్లతో పాటు కొత్తగా కనెక్షన్‌ చేసుకునేవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని జియో పేర్కొంది. ఈ ఆఫర్ కింద కొత్త యూజర్లకు ఏకంగా 30 శాతం డిస్కౌంట్ లభిస్తుందని కూడా తెలిపింది.

ప్లాన్ రేటు ఎంతంటే..

నేటి(జూలై 26) నుంచి ఆగస్టు 15 మధ్య కొత్తగా చేరే కస్టమర్లకు ఇన్‌స్టలేషన్ ఛార్జీలు రూ.1000 మాఫీ అవుతాయని గురువారం వెల్లడించింది. ఎయిర్ ఫైబర్ సర్వీసు పొందే వారు కనీసం మూడు నెలల ప్లాన్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. 3 నెలలు, 6 నెలలు, 12 నెలల 5జీ, 5జీ ప్లస్ ప్లాన్లను వార్షిక ప్లాన్లు అమలులోకి తెచ్చింది. జియో ఫ్రీడమ్ ఆఫర్ 3 నెలల ఆల్ ఇన్ వన్ ప్లాన్‌కు ప్రస్తుతం రూ. 3,121 చెల్లించాల్సి వస్తుంది. ఇందులోనే రూ.1000 ఇన్‌స్టలేషన్ ఛార్జీలు కలిపి ఉంటాయని తెలిపింది. ఇవి మాఫీ అవుతాయి కాబట్టి కొత్త యూజర్లకు రూ. 2,121లకే జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ పొందవచ్చు.



Next Story