- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
65,000కు చేరిన బంగారం
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పరిణామాలతో పసిడి ధరలు సరికొత్త గరిష్ఠాలను తాకాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఒక్కరోజే రూ. 760 పెరిగి రూ. 64,850కి చేరింది. ఓ దశలో పది గ్రాములు రూ. 65 వేల మార్కును తాకాయి. వెండి కూడా ఒక్కసారిగా రూ. 1,200 పెరిగి కిలో రూ. 78,200 చేరుకుంది. జూన్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే ఊహాగానాలతో పాటు భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారని నిపుణులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలతోనే దేశీయంగా కూడా పసిడి ధరలు ఊపందుకున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ వెల్లడించారు. హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం 24 క్యారెట్ల 10 గ్రాములు రూ. 64,850 ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 700 పెరిగి రూ. 59,450 వద్ద ఉంది. ముంబై, కోల్‌కతా సహా ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 64,850గా ఉంది. చెన్నైలో 10 గ్రాములు రూ. 65,620గా ఉంది.