- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Gold: తొలిసారి రూ. 83,000 దాటిన బంగారం

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు మరోసారి రికార్డు గరిష్టాలకు చేరాయి. గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా ఆభరణాల వ్యాపారులు, రిటైలర్ల నుంచి పెద్ద ఎత్తున కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో శుక్రవారం దేశ రాజధానిలో మొదటిసారిగా 10 గ్రాములకు రూ. 83,000 మైలురాయిని దాటాయి. వరుసగా ఎనిమిదో రోజు ధరలు పెరగడం గమనార్హం. స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాములు శుక్రవారం సాయంత్రానికి రూ. 83,100కు చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం పది గ్రాములు రూ. 200 పెరిగి రూ. 82,700కి చేరుకుందని సరాఫా తెలిపింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 300 పెరిగి రూ. 75,550 చేరుకుంది. వెండి రూ. 1,000 పెరిగి రూ. 1,05,000గా ఉంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవి చేపట్టిన వెంటనే పన్నుల విషయంలో అనుసరించే ధోరణి పట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో ట్రంప్ పాలన ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపవచ్చనే అంచనాల మధ్య ఎక్కువమంది సురక్షిత పెట్టుబడి సాధానాల వైపునకు మళ్లుతున్నారు. ఈ కారణంగానే పసిడికి డిమాండ్ పెరిగిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. అంతేకాకుండా వచ్చే నెల కేంద్ర యూనియన్ బడ్జెట్ ప్రకటించనుండటం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై నిర్ణయాల ఆధారంగా బంగారం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లోని కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు.