- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Gold కొనాలనుకుంటున్నారా.. అయితే మీకు Good News!
హైదరాబాద్: బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. కొన్ని నెలల నుంచి గరిష్ఠ స్థాయిలో కొనసాగుతున్న పసిడి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ ఏడాది పండుగ సీజన్ వస్తున్న నేపథ్యంలో ధరలు దిగొస్తున్నాయి. వరుసగా బంగారం ధరలు క్షీణిస్తూ సామాన్యుల చేరువకు వస్తున్నాయి. దీనికి ప్రధానంగా అమెరికా బాండ్ మార్కెట్లో బాండ్ ఈల్డ్స్ ఆదాయం పెరిగింది. దీంతో పెట్టుబడిదారులు ఎక్కువగా బాండ్ల మీదనే పెట్టుబడి పెడుతున్నారు. అందుకే దేశీయంగా బంగారం తగ్గుముఖం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలోనే వరుసగా మూడో రోజు పసిడి ధరలు దిగొచ్చాయి. గురువారం సాయంత్రం నాటికి హైదరాబాద్‌లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 280 తగ్గి రూ. 59,670కి తగ్గగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 250 తగ్గి రూ. 54,700కి చేరుకుంది. వెండి కిలో రూ. 500 క్షీణించి రూ. 76,200 వద్దకు చేరింది.
దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో పసిడి ధరలను గమనిస్తే, 24 క్యారెట్ల పది గ్రాములు ఢిల్లీలో రూ. 59,820, ముంబైలో రూ. 59,670, చెన్నైలో రూ. 60,050, బెంగళూరులో రూ. 59,670, కోల్‌కతాలో రూ. 59,670, పూణెలో రూ. 59,670 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం భారీగా తగ్గింది. బుధవారం ఔన్స్స్పాట్గోల్డ్ ధర 1932 డాలర్లు ఉండగా, గురువారం 13 డాలర్లు తగ్గి 1919 డాలర్లకు చేరింది.
వెండి ధరలు దాదాపు స్థిరంగా ఔన్స్22.70 డాలర్లుగా ఉంది. మరోవైపు, ఈ నెల 8న ముగిసిన ఇండియా ఇంటర్నేషనల్ జ్యువెలరీ షో(ఐఐజేఎస్)-2023లో రూ. 70,000 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని రత్నాభరణాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ గురువారం వెల్లడించింది. ఆరు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 50 వేల మంది సందర్శకులు, 2,100 మంది విదేశీ ప్రతినిధులు వచ్చారని పేర్కొంది.