రూ. 2 వేల నోట్లను ఇవ్వడం నిలిపేసిన ఎన్‌బీఎఫ్‌సీలు!

by Hamsa |
రూ. 2 వేల నోట్లను ఇవ్వడం నిలిపేసిన ఎన్‌బీఎఫ్‌సీలు!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ ఇటీవల ఆర్‌బీఐ ఉపసంహరించుకున్న రూ. 2 వేల నోట్లను వినియోగదారులకు ఇవ్వడం నిలిపేసినట్టు తెలిపాయి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముత్తూట్ ఫిన్‌కార్ప్, ఇండెల్ మనీతో సహా పముఖ గోల్డ్ లోన్ కంపెనీలు తమ కస్టమర్లకు రూ.2 వేల నోట్లను జారీ చేయట్లేదని స్పష్టం చేశాయి. ఆర్‌బీఐ సెప్టెంబర్ 30 వరకు పెద్ద నోటు చట్టబద్ధంగా ఉంటుందని చెప్పినప్పటికీ ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు తాజా నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఎన్‌బీఎఫ్‌సీలన్నీ రూ. 2 వేల నోటును ప్రజల నుంచి తీసుకోవడం కొనసాగిస్తున్నాయని, అవసరమైనపుడు కేవైసీ వివరాలను కోరుతున్నట్టు పేర్కొంటున్నాయి.

వినియోగదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో బంగారంపై రుణం తీసుకునే వారికి రూ. 2 వేల నోటును ఇవ్వడం లేదని ముత్తూట్ ఫిన్‌కార్ప్ డైరెక్టర్ థామస్ జార్జ్ ముత్తూట్ అన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్‌కు రైతులు వ్యవసాయ పరికరాలను కొనుగోలు చేస్తారు. అలాగే, స్కూళ్లు, కాలేజీల కోసం అంటూ రానున్న మూడు నెలల పాటు బంగారంపై రుణాలు తీసుకోవడం పెరుగుతాయి. ఈ సమయంలో రూ. 2 వేల నోట్లను వారికి ఇవ్వడం వల్ల మార్పిడి విషయంలో ఇబ్బందులు పడవచ్చు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇండెల్ మనీ సీఈఓ ఉమేష్ మోహనన్ చెప్పారు. ప్రజల నుంచి మాత్రం రూ. 2 వేల నోట్లను తీసుకోవడం కొనసాగిస్తామని వెల్లడించారు.

Advertisement

Next Story