- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సరికొత్త రికార్డులకు చేరిన బంగారం ధరలు!
హైదరాబాద్: దేశవ్యాప్తంగా మరో వారం రోజుల్లో అక్షయ తృతీయ పండుగ సందర్భంగా బంగారం కొనేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పసిడి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. సాధరణంగా అక్షయ తృతీయకు సామాన్యులు బంగారం కొనడాన్ని సాంప్రదాయంగా భావిస్తారు. ఈ తరుణంలో బంగారం అందనంత స్థాయిలకు చేరుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ బంగారం గిరాకీ ఊపందుకోవడంతో ధరలు ఆకాశాన్నంటాయి. ఆ ప్రభావంతో దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. డాలర్‌తో పాటు బాండ్ల విలువ క్షీణించడంతో పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడికి మొగ్గు చూపుతున్నారు. దానివల్లే ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.
శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 600 పెరిగి రూ. 61,800 ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 550 పెరిగి రూ. 56,650కి చేరుకుంది. బంగారం బాటలోనే వెండి సైతం కిలో రూ. 1,200 పెరిగి రూ. 83,000కు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2,041 డాలర్లు ఉండగా, వెండి ఔన్సు 25.88 డాలర్లుగా ఉంది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే, 24 క్యారెట్ల పది గ్రాములు ఢిల్లీలో రూ. 61,950, ముంబైలో రూ. 61,800, చెన్నైలో రూ. 61,500, బెంగళూరులో రూ. 61,850, కోల్‌కతాలో రూ. 61,800గా ఉంది.