- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
30 శాతం తగ్గిన బంగారం దిగుమతులు!
న్యూఢిల్లీ: కరెంటు ఖాతా లోటుపై నేరుగా ప్రభావం చూపే బంగారం దిగుమతులు దాదాపు 30 శాతం తగ్గి 31.8 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 2.60 లక్షల కోట్ల)కు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. అధిక కస్టమ్స్ సుంకంతో పాటు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య 2022-23 ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో పసిడి దిగుమతులు 30 శాతం పడిపోయాయని డేటా వెల్లడించింది. అంతకుముందు 2021-22, ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య బంగారం దిగుమతులు 45.2 బిలియన్ డాలర్లు(రూ. 3.7 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. 2022, ఆగష్టు నుంచే పసిడి దిగుమతులు ప్రతికూలంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
అదేవిధంగా సమీక్షించిన కాలంలో వెండి దిగుమతులు 66 శాతం పెరిగి రూ. 44 వేల కోట్లకు చేరుకున్నాయి. అయితే, బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గినప్పటికీ దేశ వాణిజ్య లోటును తగ్గించడంలో సహాయపడలేదు. సమీక్షించిన కాలంలో సరుకుల వాణిజ్య లోటు 247.52 బిలియన్ డాలర్లు(రూ. 20.25 లక్షల కోట్ల)గా ఉంటుందని అంచనా. ఇది 2021-22 నాటి 172.53 బిలియన్ డాలర్ల(రూ. 14.20 లక్షల కోట్లుగా నమోదైంది.