'పార్క్ అవెన్యూ' సహా ఇతర బాండ్లను కొనుగోలు చేసిన గోద్రేజ్ కన్స్యూమర్!

by Harish |   ( Updated:2023-04-27 15:46:36.0  )
పార్క్ అవెన్యూ సహా ఇతర బాండ్లను కొనుగోలు చేసిన గోద్రేజ్ కన్స్యూమర్!
X

ముంబై: గోద్రేజ్ గ్రూపునకు చెందిన గోద్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్(జీసీపీఎల్) దేశీయ డియొడరెంట్స్, వెల్‌నెస్ విభాగంలో దిగ్గజ బ్రాండ్‌గా ఉన్న రేమండ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్(ఆర్‌సీసీఎల్) ఎఫ్ఎంసీజీ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య గురువారం ఒప్పందం జరిగినట్లు తెలిపింది.

రేమండ్ కన్స్యూమర్ ఎఫ్ఎంసీజీ విభాగంలో పార్క్ అవెన్యూ, కేఎస్, కామసూత్ర, ప్రీమియం వంటి బ్రాండ్ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ కొనుగోలు కోసం జీసీపీల్ రూ. 2,825 కోట్లను చెల్లించనుందని, ఒప్పంద ప్రక్రియ ఈ ఏడాది మే 10 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నట్టు పేర్కొంది.

'రేమండ్ కన్స్యూమర్ బ్రాండ్లను కొనుగోలు చేయడం పట్ల సంతోషంగా ఉంది. తమ పోర్ట్‌ఫోలియోను మరింత పటిష్టం చేస్తూ, దీర్ఘకాల వృద్ధి లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకున్నామని' జీసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సుధీర్ సీతాపతి చెప్పారు. తమ పార్క్ అవెన్యూ, కామసూత్ర బ్రాండ్లను గోద్రేజ్‌కు విక్రయించడం ద్వారా వాటి వృద్ధి మరింత పెంచేందుకు వీలవుతుందని భావిస్తున్నట్టు రేమండ్ గ్రూప్ వైస్-చైర్మన్ అతుల్ సింగ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed