Fresher Hiring: ఐటీ రంగంలో పెరుగుతున్న ఫ్రెషర్ల నియామకాలు

by S Gopi |
Fresher Hiring: ఐటీ రంగంలో పెరుగుతున్న ఫ్రెషర్ల నియామకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్ని నెలలుగా భారత ఐటీ రంగంలో భారీ సంఖ్యలో లేఆఫ్స్ జరిగాయి. ఖర్చులను తగ్గించుకునేందుకు తొలగింపులు చేపట్టాయి. తాజాగా పరిస్థితులు సానుకూలంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో ఫ్రెషర్ల నియామకాలు 20-25 శాతం పెరగనున్నాయని డిజిటల్ అనలిటిక్ ప్లాట్‌ఫామ్ టీమ్‌లీజ్ అంచనా వేసింది. ఇదే సమయంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీ) సైతం ఫ్రెషర్ల నియామకాలను గతేడాది కంటే 40 శాతం పెంచనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్(ఎంఎల్), డేటా వంటి విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగుల డిమాండ్ ఏర్పడటంతో నియామకాలు పెరుగుతాయని టీమ్‌లీజ్ నివేదిక అభిప్రాయపడింది. ముఖ్యంగా ఈ ఏడాదిలో ఒక్కటే ఎంఎల్ నైపుణ్యం ఉన్న ఉద్యోగుల నియామకాలు 69 శాతం పెరగడం ఇందుకు సాక్ష్యం. ప్రధానంగా ఐటీ వ్యాప్తంగా పైథాన్ ప్రోగ్రామింగ్, ఎథికల్ హ్యాకింగ్, పెనెట్రేషన్ టెస్టింగ్, ఎజైల్ స్క్రమ్ మాస్టర్, ఏడబ్ల్యూఎస్ సెక్యూరిటీ, జావా స్క్రిప్ట్ లాంటి స్కిల్స్‌కు అధిక డిమాండ్ కనిపిస్తోందని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story