భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 28 వేల కోట్ల విదేశీ నిధులు వెనక్కి!

by Disha News Desk |
భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 28 వేల కోట్ల విదేశీ నిధులు వెనక్కి!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా ఫెడ్ నిర్ణయంతో ప్రస్తుతం నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ. 28,243 కోట్ల నిధులను వెనక్కి తీసుకెళ్లారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం.. ఎఫ్‌పీఐ నిధులు రుణ విభాగంలో రూ. 2,210 కోట్లను, హైబ్రిడ్ విభాగంలో రూ. 1,696 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దీంతో నికరంగా రూ. 24,337 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నారు. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు నిధులను వెనక్కి తీసుకోవడం తో వరుసగా నాలుగో నెలలో కూడా ఎఫ్‌పీఐ అమ్మకాల ధోరణి నమోదైంది. అమెరికా ఫెడ్ త్వరలో వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచుతుందని ప్రకటించడంతో భారత ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు అమ్మకాలను పెంచారని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు.

విదేశీ ఇన్వెస్టర్లు గత రెండేళ్లుగా భారీ అంచనాలతో అధిక లాభాల్లో ఉన్న ఐటీ షేర్ల నుంచి లాభాలను తీసుకున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ చెప్పారు. దీనివల్ల ఫైనాన్స్ రంగాల షేర్లు విదేశీ మదుపర్లు విక్రయించడం తో ముఖ్యంగా ప్రముఖ బ్యాంకుల షేర్ ధరలపై ప్రభావం పడుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ముడిచమురు ధరల వల్ల ఎఫ్‌పీఐల నిధుల ప్రవాహం అస్థిరంగా ఉండొచ్చని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed