పది రోజుల్లో రూ. 9,600 కోట్ల నిధులను వెనక్కి తీసుకెళ్లిన విదేశీ పెట్టుబడిదారులు!

by Vinod kumar |
పది రోజుల్లో రూ. 9,600 కోట్ల నిధులను వెనక్కి తీసుకెళ్లిన విదేశీ పెట్టుబడిదారులు!
X

ముంబై: ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లతో పోలిస్తే భారత ఈక్విటీ మార్కెట్లు ప్రీమియం గా మారిన కారణాలతో విదేశీ పెట్టుబడిదారులు నిధులను ఉపసంహరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇప్పటివరకు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ)లు రూ. 9,600 కోట్ల విలువైన నిధులను వెనక్కి తీసుకెళ్లారు. గత నెలలో ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 28,852 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు.

ఇది గత ఏడు నెలల్లో అత్యంత దారుణమైన నిధుల ఉపసంహరణ అని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు డిసెంబర్‌లో ఎఫ్‌పీఐలు రూ. 11,119 కోట్లు, నవంబర్‌లో రూ. 36,238 కోట్ల విలువైన పెట్టుబడులను పెట్టారు. ఇటీవల భారత సెంట్రల్ బ్యాంక్ ఆర్‌బీఐ వరుస సమావేశాల్లో కీలక రేట్లను పెంచుతున్న నేపథ్యంలో ఎఫ్‌పీఐల ధోరణి మరికొంత కాలం అస్థిరంగానే ఉంటుందని కోటక్ సెక్యూరిటీస్ రిటైల్ విభాగం హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు.

ప్రస్తుతం అదానీ కంపెనీల వ్యవహారం ఉన్న కారణంగా, దీనిపై స్పష్టత వచ్చే వరకు ఎఫ్‌పీఐల నిధుల ఉపసంహరణ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed