- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దాదాపు రూ. 38 వేల కోట్ల విలువైన నిధులను వెనక్కి తీసుకున్న ఎఫ్‌పీఐలు!
ముంబై: 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో నిధులను ఉపసంహరించుకున్న తర్వాత విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ)లు గత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలను కొనసాగించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపులో దూకుడుగా వ్యవహరిస్తున్న కారణంగా భారత ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు రూ. 37,631 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ అత్యుత్తమ వృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున్న విదేశీ మదుపర్లు పెట్టుబడులకు మొగ్గు చూపే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి కె విజయకుమార్ అన్నారు.
2023-24లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు యూఎస్ ఫెడ్ పాలసీ వైఖరి, ముడి చమురు ధరలు, భౌగోళిక రాజకీయ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 1993లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు మొదలైన నాటి నుంచి వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాల్లో విక్రయాలు నమోదవడం ఇదే తొలిసారి. 2021-22లో రూ. 1.4 లక్షల కోట్లను విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్‌పీఐలు, 2022-23లో రూ. 37,632 కోట్లకు తగ్గిందని డిపాజిటరీ గణాంకాలు తెలిపాయి. అంతకుముందు 2020-21లో రికార్డు స్థాయిలో రూ. 2.7 లక్షల కోట్లు, 2019-20లో రూ. 6,152 కోట్ల పెట్టుబడులను భారత ఈక్విటీల్లో పెట్టారు. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి వారంలో ఎఫ్‌పీఐలు రూ. 3,747 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.
Also Read..