జూలైలో రూ. 45 వేల కోట్లు దాటిన విదేశీ పెట్టుబడులు!

by Vinod kumar |
జూలైలో రూ. 45 వేల కోట్లు దాటిన విదేశీ పెట్టుబడులు!
X

ముంబై: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. మెరుగైన ఆర్థిక వృద్ధి, కంపెనీల త్రైమాసిక ఫలితాల మద్దతు నేపథ్యంలో జూలైలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు రూ. 45,365 కోట్ల విలువైన షేర్లను కొన్నారని డిపాజిటరీ గణాంకాలు వెల్లడించాయి. అయితే, గతవారం చివరి రెండు సెషన్లలో అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాల కారణంగా అమ్మకాలకు సిద్ధపడినప్పటికీ మొత్తంగా సానుకూలంగా ఎఫ్‌పీఐల ధోరణి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అమెరికా వడ్డీ రేట్ల పెంపు ప్రభావం వల్ల గ్లోబల్ లిక్విడిటీపై ప్రభావం వల్ల ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడి నిర్ణయాలపై సమీక్షించనున్నారని, అందుకే గతవారాంతంలో అమ్మకాలు నమోదయ్యాయని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, జూలైలో రూ. 45,365 కోట్ల నిధులను మార్కెట్లలో పెట్టగా, ఇది వరుసగా మూడో నెలలో రూ. 40 వేల కోట్ల మార్కు దాటింది. అంతకుముందు జూన్‌లో ఎఫ్‌పీఐలు రూ. 47,148 కోట్లు, మేలో రూ. 43,838 కోట్ల పెట్టుబడులు పెట్టారు. విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఫైనాన్స్, ఆటో, కేపిటల్ గూడ్స్, రియల్ ఎస్టేట్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో నిధులు ఉంచారు.

Advertisement

Next Story

Most Viewed