- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FPI: పన్ను పెంపుతో రెండు రోజుల్లో $1 బిలియన్ విలువైన ఈక్విటీలను విక్రయించిన FPIలు
దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈక్విటీ పెట్టుబడుల ద్వారా వచ్చే మూలధన లాభాలపై పన్నులను పెంచిన నేపథ్యంలో కేవలం రెండు రోజుల్లో విదేశీ పెట్టుబడిదారులు దాదాపు $1 బిలియన్ విలువైన భారతీయ ఈక్విటీలను విక్రయించారు. మంగళవారం, బుధవారాల్లో ఈ విక్రయాలు నమోదైనట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ తాత్కాలిక డేటా వెల్లడించింది.
బడ్జెట్ ప్రవేశ పెట్టకముందు ప్రోత్సహకాలు, రాయితీలు, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడే పలు పథకాలు ఉంటాయని అంచనాలతో గత ఆరు సెషన్లలో విదేశీ పెట్టుబడిదారులు $2.20 బిలియన్ల నికర మొత్తం విలువ చేసే ఈక్విటీలను కొనుగోలు చేశారు. అయితే బడ్జెట్ వారి అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో క్రమంగా అమ్మకాలకు దిగుతున్నారు. ముఖ్యంగా మూలధన లాభాలపై పన్ను ప్రతిపాదనలు ఈ ధోరణికి ఎక్కువ కారణమైంది.
బడ్జెట్‌లో కేంద్రం ఈక్విటీ షేర్లలో, ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడిపెట్టే మదుపరులు ఆర్జించే లాభాలపై పన్నును పెంచింది. స్వల్పకాలిక మూలధన లాభాలపై పన్ను 15 నుంచి 20 శాతానికి, దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నును 10 నుంచి 12.5 శాతానికి పెంచుతూ నిర్ణయించింది. దీంతో స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక లాభాలు పొందే వారు అదనంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. పెట్టుబడుల కాలపరిమితి ఒక ఏడాది కంటే తక్కువ ఉంటే స్వల్పకాలిక లాభాలుగా, ఒక ఏడాది కంటే ఎక్కువ కాలాన్ని దీర్ఘకాలిక లాభాలుగా పరిగణిస్తారు.