ఏటా 52 శాతం పెరగనున్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు!

by Harish |
ఏటా 52 శాతం పెరగనున్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: రాబోయే మూడేళ్లలో దేశంలోని సరసమైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల వృద్ధి ఏటా 52 శాతం పెరుగుతుందని పరిశోధనా సంస్థ తెలిపింది. ప్రస్తుతం రూ. 60 వేల నుంచి రూ. 75 వేల మధ్య ఉన్న సరసమైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల వాటా మొత్తం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 10 శాతం వాటాను కలిగి ఉంది. సైబర్‌మీడియా రీసెర్చ్ తాజా వివరాల ప్రకారం, టెక్నాలజీ అభివృద్ధితో పాటు వినియోగదారుల నుంచి పెరుగుతున్న ఆదరణ ద్వారా బడ్జెట్ ధరల ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల వాటా గణనీయంగా పెరగనుంది. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల మధ్య పోటీ కూడా వృద్ధికి దోహదపడనుంది.

పరిశ్రమలో పెరుగుతున్న పోటీ కారణంగా ఈ ఏడాది ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు కనీసం 12-15 శాతం తగ్గుతాయని సైబర్‌మీడియా అనలిస్ట్ మేనకా కుమారి అన్నారు. దాంతో ఈ విభాగంలో అమ్మకాలు పెరిగేందుకు అవకాశాలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణం, సరఫరా, భౌగోళిక రాజకీయ పరిణామాల సమస్యలు ఉన్నప్పటికీ ఈ ఏడాది ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగం 65 శాతం వృద్ధిని సాధించగలదని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ విభాగంలో టెక్నో, ఒప్పో బ్రాండ్లు ప్రవేశించాయి. అయితే, శాంసంగ్ ఈ విభాగంలో పటిష్ఠంగా కొనసాగుతోందని నివేదిక పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed