రూ. 8,900 కే Flipkartలో Apple iPad.. ఓన్లీ లిమిటెడ్ ఆఫర్

by Harish |   ( Updated:2023-06-02 12:54:46.0  )
రూ. 8,900 కే Flipkartలో Apple iPad.. ఓన్లీ లిమిటెడ్ ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ను తెచ్చింది. యాపిల్ ఐప్యాడ్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తుంది. కొత్తగా ఇటీవల మార్కెట్లోకి విడుదలైన Apple iPad 10th Generation పై భారీ తగ్గింపును ఇస్తుంది. ఈ మోడల్ అసలు ధర రూ. 41,900. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఇది కంపెనీ డైరెక్ట్ ఆఫర్ ద్వారా రూ.3000 తగ్గింపుతో లభిస్తుంది. అదనంగా కొనుగోలు సమయంలో HDFC క్రెడిట్ కార్డు పూర్తి స్వైప్ లావాదేవీలపై రూ. 3000 తగ్గింపు పొందవచ్చు. దీంతో ఫోన్ ధర రూ. 38,900కి తగ్గుతుంది.

అలాగే అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. దీని క్రింద పాత ఫోన్‌ను ఇచ్చినట్లయితే రూ. 30,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇవన్ని ఆఫర్లు కరెక్ట్‌గా వాడుకున్నట్లయితే Apple iPad కేవలం రూ. 8,900కే చేతికి వస్తుంది. యాపిల్ ఐప్యాడ్ 10.9 అంగుళాల పూర్తి HD డిస్‌ప్లే, 12 MP మెయిన్ కెమెరా, 2 MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది న్యూరల్ ఇంజిన్‌తో కూడిన A14 బయోనిక్ చిప్ (64-బిట్ ఆర్కిటెక్చర్) ఆధారంగా పనిచేస్తుంది.



Also Read..

EMIలో రూ.525కే పవర్ ఫుల్ మిస్ట్ కూలర్ ఫ్యాన్.. బ్యాటరీతో 48 గంటలు రన్

Advertisement

Next Story