Crorepatis: గత పదేళ్లలో ఐదు రెట్లు పెరిగిన కోటీశ్వరులు

by S Gopi |
Crorepatis: గత పదేళ్లలో ఐదు రెట్లు పెరిగిన కోటీశ్వరులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గడిచిన పదేళ్ల కాలంలో దేశీయంగా కోటీశ్వరుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆదాయపు పన్ను శాఖ గణాంకాల ప్రకారం సమీక్షించిన కాలంలో రూ. కోటికి పైగా పన్ను ఆదాయం ప్రకటించిన వారు ఐదు రెట్లు పెరిగారు. అంటే.. 2013-14(2012-13 ఆర్థిక సంవత్సరం) అసెస్‌మెంట్ ఏడాదిలో 44,078 మంది రూ. కోటికి పైగా పన్ను చెల్లించగా, 2023-24 నాటికి ఇది దాదాపు 2.3 లక్షలకు చేరుకుంది. ఆదాయం పెరగడం, పన్ను అధికారుల చర్యల కారణంగా వృద్ధి నమోదైంది. ప్రభుత్వ డేటా ఆధారంగా పదేళ్ల క్రితం కోటీశ్వరులు దాఖలు చేసిన పన్ను రిటర్నుల సంఖ్య 3.3 కోట్ల నుంచి గతేడాది 7.5 కోట్లతో 2.2 రెట్లు పెరిగాయి. అలాగే రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ప్రకటించిన వారు 2022-23లో 49.2 శాతం ఉండగా, 2013-14లో 52 శాతంగా ఉన్నారు. 2013-14లో ఒక వ్యక్తి మాత్రమే రూ. 500 కోట్లకు పైగా ఆదాయాన్ని ప్రకటించగా, ఇద్దరు రూ. 100-500 కోట్ల ఆదాయాన్ని ప్రకటించారు. అలాగే, రూ. 25 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ప్రకటించిన వారి సంఖ్య 1,812 నుంచి 1,798కి తగ్గడం గమనార్హం. రూ. 10 కోట్లకు పైగా ఆదాయం ఉన్నవారు 1,656 నుంచి 1,577కి పడిపోయారు.

Advertisement

Next Story

Most Viewed