టెక్ ఉద్యోగులకు మరో షాక్.. గూగుల్ ఆల్ఫాబెట్‌లో లేఆఫ్!

by Harish |   ( Updated:2023-09-14 07:07:02.0  )
టెక్ ఉద్యోగులకు మరో షాక్.. గూగుల్ ఆల్ఫాబెట్‌లో లేఆఫ్!
X

దిశ, వెబ్‌డెస్క్: దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీ HR(రిక్రూటింగ్) విభాగం నుంచి వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. ఖచ్చితంగా ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్న విషయం పేర్కొనలేదు. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించడం, నిర్వహణను మెరగుపర్చుకోడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడానికి రిక్రూటింగ్ బృందం పరిమాణాన్ని తగ్గించాలని నిర్ణయించినట్లు కంపెనీ ప్రతినిధి ఒక నివేదికలో పేర్కొన్నారు.

ఉద్యోగం నుంచి తొలగించిన కూడా వారికి మరొక ఉపాధి పొందడానికి సహాయం చేస్తామని ప్రతినిధి తెలిపారు. ప్రపంచ ఆర్థిక మందగమనం మధ్య గూగుల్ గత ఏడాది నియామకాలను తగ్గించింది. ఈ ఏడాది జనవరి 20న, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులకు రాసిన లేఖలో ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ధృవీకరించారు.

మార్చిలో గూగుల్ ఇండియా 400 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం వారిలో తక్కువ మంది సీనియర్ స్థాయిలకు పదోన్నతి పొందుతారు. ఖర్చులను మరింత తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగుల తొలగింపులతో పాటు ఉచిత స్నాక్స్, వర్కౌట్ క్లాసెస్, కంపెనీ ల్యాప్‌టాప్‌ల వంటి వ్యక్తిగత పరికరాలపై ఖర్చు చేయడం కూడా తగ్గించింది.

Advertisement

Next Story

Most Viewed