- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2022-23లో రెండున్నర రెట్లు పెరిగిన ఈవీ టూ-వీలర్ అమ్మకాలు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ వాహనాల అమ్మకాలు రెండున్నర రెట్లు పెరిగాయని పరిశ్రమ సంఘం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,46,976 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు 2021-22లో మొత్తం 3,27,900 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) విక్రయించబడ్డాయని సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్(ఎస్ఎంఈవీ) సోమవారం ప్రకటనలో పేర్కొంది.
గత ఆర్థిక సంవత్సరంలో గంటకు 25 కిలోమీటర్ల కంటే తక్కువ స్పీడ్‌తో ప్రయాణించే ఈ-స్కూటర్లు 1.20 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకు మించి ఎక్కువ వేగంతో ప్రయాణించే ఈవీ వాహనాలు 7.27 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయని ఎస్ఎంఈవీ వివరించింది. అయితే, ఈ వృద్ధి వివిధ ప్రభుత్వ రంగ పరిశోధనా సంస్థలు అంచనా వేసిన దానికంటే తక్కువగానే ఉంది. కొన్ని కంపెనీలు ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేమ్ 2 పథకం రాయితీల నుంచి వైదొలగడం అమ్మకాలపై ప్రభావం చూపినట్టు ఎస్ఎంఈవీ వెల్లడించింది.