- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎగుమతుల్లో 8 బిలియన్ డాలర్ల మైలురాయి దాటిన అమెజాన్ ఇండియా
దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2023లో భారత్ నుంచి 8 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతుల మైలురాయిని చేరుకుంది. మన కరెన్సీలో ఈ ఎగుమతుల విలువ సుమారు రూ. 67 వేల కోట్లు. అంతకుముందు 2022లో కంపెనీ 5 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను నమోదు చేసింది. 2025 నాటికి 20 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకోగలమనే విశ్వాసం ఉందని కంపెనీ గురువారం ప్రకటనలో తెలిపింది. 'సరిగ్గా ఏడేళ్ల క్రితం భారత్ నుంచి ఎగుమతులను ప్రారంభించాం. అనుకున్న దానికంటే వేగవంతమైన వృద్ధిని చూస్తున్నామని, 2025 నాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటామని' అమెజాన్ ఇండియా గ్లోబల్ ట్రేడ్ డైరెక్టర్ భూపేన్ వాకంకర్ అన్నారు. అమెజాన్ ఇండియా ప్రధానంగా బొమ్మలు, హోమ్ అండ్ కిచెన్ ప్రోడక్ట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్, ఫర్నిచర్, ఇతర సామగ్రిని ఎగుమతి చేస్తోంది. లెదర్, ఆయుర్వేద ఉత్పత్తుల ఎగుమతులు కొంత నెమ్మదించాయి. ఎక్కువగా యూకే, కెనడా, జపాన్, జర్మనీతో పాటు అమెరికా భారత ఎగుమతులకు అతిపెద్ద మార్కెట్లుగా ఉన్నాయి.