Airtel: ఎయిర్ టెల్ కొత్త 5జీ డేటా బూస్టర్ గురించి తెలుసా.. ఎలా రీఛార్జ్ చేసుకోవాలంటే.. ?

by Prasanna |
Airtel: ఎయిర్ టెల్ కొత్త 5జీ డేటా బూస్టర్ గురించి తెలుసా.. ఎలా రీఛార్జ్ చేసుకోవాలంటే.. ?
X

దిశ, ఫీచర్స్: ఒకప్పుడు టెలికాం మార్కెట్లో జియె, బీఎస్ఎన్ఎల్ పేర్లు బాగా వినిపించేవి కానీ, ఇప్పుడు ఎయిర్ టెల్ పేరు కూడా బాగా వినబడుతోంది కారణం తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్లాన్స్ ను తీసుకురావడంలో ఏ మాత్రం ఆలస్యం చేయడం లేదు.

దేశంలో ఎన్నడూ లేని విధంగా ఎయిర్ టెల్ కొత్త 5జీ డేటా బూస్టర్లను మన ముందుకు తీసుకొచ్చింది. సాధారణంగా రూ. 349 తో ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే రోజుకి 2జీబీ డేటా వస్తుంది. కానీ ఇప్పుడు ఈ 5జీ డేటా యాక్సెస్ ను తక్కువ డేటా ప్లాన్లు వారు కూడా ఉపయోగించుకునేలా ఈ కొత్త డేటా బూస్టర్లను ప్రవేశపెట్టింది. దీని సాయంతో 1జీబీ, 1.5జీబీ రోజు వారీ డేటా వాడే వారు కూడా వినియోగించుకోవచ్చు. ఈ కొత్త డేటా బూస్టర్ల ప్యాక్ లు రూ. 51, రూ. 101, రూ. 151కి అందుబాటులో ఉన్నాయి.

డేటా బూస్టర్ ప్లాన్ల వివరాలు

ఎయిర్ టెల్ రూ. 51 తో రీఛార్జ్ చేసుకుంటే ఆ రోజులో ఉన్న డేటాకి 3జీబీ డేటా యాడ్ అవుతుంది. అలాగే రూ. 101 డేటా బూస్టర్ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే ఉన్న ప్లాన్ కి 6జీబీ డేటా యాడ్ అవుతుంది. రూ. 151 డేటా బూస్టర్ ప్యాక్ రీఛార్జ్ చేసుకుంటే ఉన్న ప్లాన్ కి 9జీబీ డేటా యాడ్ అవుతుంది.



Next Story

Most Viewed