- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ ఏడాదిలోగా ఐడీబీఐ బ్యాంక్ వాటాల విక్రయం
దిశ, బిజినెస్ బ్యూరో: 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఐడీబీఐ బ్యాంక్ వ్యూహాత్మక వాటా విక్రయాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(దీపమ్) సెక్రటరీ తుహిన్ కాంత పాండె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, రెగ్యులేటర్ల క్లియరెన్స్ పొందిన తర్వాత ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానిస్తామని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ పనులన్నీ పూర్తవుతాయన్నారు. ఐడీబీఐ బ్యాంకులో ప్రస్తుతం ఎల్‌ఐసీ 49.24 శాతం వాటా, కేంద్ర ప్రభుత్వం 45.48 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్రైవేటీకరణలో భాగంగా 30.48 శాతం ఎల్‌ఐసీ వాటా, 30.24 ప్రభుత్వ వాటాలను విక్రయించనున్నారు. యాజమాన్య హక్కులను సైతం బదిలీ చేయనున్నారు. వాటాల విక్రయం తర్వాత ప్రభుత్వం, ఎల్‌ఐసీ వాటా 34 శాతానికి తగ్గనుంది. ఈ ప్రక్రియలో భాగంగా 2022, అక్టోబర్‌లోనే బిడ్లను ఆహ్వానించారు. అనంతరం గతేడాది జనవరిలో ఆసక్తి వ్యక్తీకరణలను స్వీకరించారు. దీని తర్వాత బిడ్డర్లు హోమ్ మంత్రిత్వ శాఖ నుంచి భద్రతా క్లియరెన్స్, ఆర్‌బీఐ నుంచి ఫిట్ అండ్ ప్రాపర్ క్లియరెన్స్‌ను పొందాల్సి ఉంటుంది.