- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎయిర్ ఏషియాకు రూ. 20 లక్షల జరిమానా
బెంగళూరు: దేశీయ విమానయాన సంస్థ టాటా గ్రూప్ యాజమాన్యంలోని 'ఎయిర్ ఏషియా'పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ. 20 లక్షల జరిమానా విధించింది. అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ నిబంధనల ప్రకారం విమాన పైలెట్‌కు నిర్వహించే సామర్థ్య నిర్వహణ పరీక్షలో ఖచ్చితమైన నిబంధనలు పాటించకుండా అలసత్వం వహించినందుకు ఎయిర్ ఏషియాపై ఈ జరిమానా విధించినట్లు డీజీసీఏ ఒక ప్రకటనలో పేర్కొంది.
డీజీసీఏ నిబంధనల ప్రకారం తమ విధులను నిర్వర్తించడంలో విఫలమైనందుకు విమాన సంస్థ ట్రైనింగ్ అధిపతిని మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. అలాగే, ఎనిమిది మంది పర్యవేక్షకులకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల జరిమానా విధించారు. ఈ విషయంపై విమానయాన సంస్థ మేనేజర్, ట్రైనింగ్ అధిపతి, పర్యవేక్షకులకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తమ విధులను నిర్వహించడంలో ఫెయిల్ అయినందుకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని పేర్కొంది. వారు ఇచ్చే వివరణల ఆధారంగా చర్యలు తీసుకుంటామని డీజీసీఏ తెలిపింది.