- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిర్ఇండియాపై భారీ జరిమానా విధించిన డీజీసీఏ
దిశ, బిజినెస్ బ్యూరో: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిర్ఇండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) భారీ జరిమానా విధించింది. ఫ్లైట్ డ్యూటీ టైమింగ్, ఎయిర్‌లైన్ క్రూ మెనేజ్‌మెంట్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా ఎయిర్ఇండియాకు రూ. 80 లక్షల పెనాల్టీని విధిస్తూ డీజీసీఏ ఆదేశించింది. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన స్పాట్ ఆడిట్‌లో భద్రతా సమీక్షకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించినట్టు నిర్ధారించాం. ఆడిట్ సమీక్షలో ఎయిర్ఇండియా సంస్థ 60 ఏళ్లు పైబడిన ఇద్దరు విమాన సిబ్బందితో విమానాలను నడుపుతునట్టు స్పష్టమైంది. అలాగే, నిబంధనల ప్రకారం విమాన సిబ్బందికి తగినంత విశ్రాంతి, ఆల్ట్రా-లాంగ్ రేంజ్ విమానాలకు ముందు, తర్వాత తగిన విశ్రాంతి, ఇతర విశ్రాంతి అందించడంలో సంస్థల నిబంధనలను పట్టించుకోలేదు. అలాగే, డ్యూటీ పీరియడ్ దాటిన సందర్భాలు, తప్పుగా ఉన్న రికార్డులు, ఓవర్ డ్యూటీ వంటి అంశాలను ఆడిటింగ్‌లో గుర్తించామని డీజీసీఏ తన ఆర్డర్‌లో పేర్కొంది. ఇదివరకు జనవరిలో సైతం డీజీసీఏ భద్రతా ఉల్లంఘాన కారణాలతో ఎయిర్ఇండియాకు రూ. 1.10 కోట్ల జరిమానా విధించింది.